శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం

|

Apr 29, 2023 | 9:35 AM

భవిష్యత్తులో సంభవించే ప్రకృతి ప్రకోపాలు, వింతలూ విశేషాల గురించి.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. వాటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. ఒక్కొక్కటిగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, అలాంటి వింత ఘటనే నిర్మల్‌ జిల్లాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

భవిష్యత్తులో సంభవించే ప్రకృతి ప్రకోపాలు, వింతలూ విశేషాల గురించి.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. వాటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. ఒక్కొక్కటిగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, అలాంటి వింత ఘటనే నిర్మల్‌ జిల్లాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఖానాపూర్‌ టౌన్‌లో ఓ వరాహం… కుక్కపిల్లలకు తల్లిలా పాలిస్తోంది. మామూలుగా అయితే పందిని చూస్తే చాలు.. వీధి కుక్కలు సర్రున ఎగబడిపోతాయి. వెంటబడి తరుముతుంటాయి. కానీ, శునకజాతిలో పుట్టిన ఈ కుక్కపిల్లలు… పంది దగ్గర పాలు తాగుతుండటం వింతగొలుపుతోంది. కలికాలంలో ఇదో వింత కాబోలు అంటూ… ఆసక్తిగా తిలకిస్తున్నారు జనం. తమ ఫోన్లలో ఆ వీడియోను బంధించి వైరల్‌ చేస్తున్నారు. కుక్కపిల్లల ఆకలి తీరుస్తున్న వరాహం అంటూ ట్యాగ్‌లైన్లు పెట్టేస్తూ.. కాలజ్ఞానంలో నిజమైన మరోసంఘటన అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎటాక్‌ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు

15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!

Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

 

Published on: Apr 29, 2023 09:35 AM