Saina Nehwal: భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ఖాళీ ప్రదేశంలో సైనా నెమలికి ఆహారం అందిస్తున్నారు. సైనా తన చేతిలో ఆహారాన్ని ఉంచుకుని నెమలి ముందు పెట్టారు. నెమలి చక్కగా వచ్చి ఆమె చేతిలో ఆహారాన్ని తీసుకుంటోంది. అక్కడ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నా ఆ నెమలి ఎక్కడా కంగారు లేకుండా సైనా చేతిలో ఆహారాన్ని తీసుకుంటుంటే ఆ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు సైనా నెహ్వాల్ ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వేలాదిమందిని ఆకర్షించింది. క్యూట్ గా ఉన్న ఆ వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు..
ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు తీసారనే వివరాలు సైనా తన పోస్ట్ లో తెలుపలేదు. అయితే, కొన్ని రోజులుగా ఆమె రాజస్థాన్ లో ఉన్నారు. ఇటీవల ఉదయపూర్ కోటను ఆమె సందర్శించారు. ఆసమయంలో ఆమె రామ్ బ్యాగ్ ప్యాలెస్ లో సైనా నెమలి తో ఉన్న వీడియో తీసి ఉండవచ్చు. ఎందుకంటే, ఆమె రాజస్థాన్ సందర్శనలో భాగంగా తన టూర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫోటోలలో కూడా ఈ నెమలి కనిపించింది. వీడియోను ఇప్పటికే 1.7 మిలియన్ మంది చూశారు. అదేస్థాయిలో కామెంట్స్ చేశారు.
భారతదేశం నుండి ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. లండన్ 2012 క్రీడల్లో కాంస్య పతకం సాధించడం ద్వారా ఆమె చరిత్ర సృష్టించారు. అంతకు ముందు 2008 లో బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను ఆమె గెలుచుకున్నారు. అదే సంవత్సరం ఆమె బీజింగ్‌లో తొలి ఒలింపిక్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే, మెడల్ సాధించడంలో విఫలం అయ్యారు. కానీ లండన్ 2012 లో మెడల్ గెలవడం ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. 17 మార్చి 1990 న జన్మించిన సైనా నెహ్వాల్ తన కుటుంబం హర్యానా నుండి హైదరాబాద్‌కు మారిన తర్వాత ఎనిమిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ కోచింగ్ లో ఆమె బ్యాడ్మింటన్ లో మెళకువలు నేర్చుకున్నారు. అంచెలంచెలుగా రాణిస్తూ బ్యాడ్మింటన్ స్టార్ గా ఎదిగారు.
Viral Video: చీరకట్టులో స్కేటింగ్…!! మహిళ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు… ( వీడియో )