Viral: ఓర్నీ బతికున్న బల్లిని అమాంతం మింగేశాడుగా.. ఎందుకో తెలుసా..? వీడియో వైరల్..

|

Jul 17, 2023 | 9:12 AM

ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో బతికున్న బల్లిని అమాంతంగా మింగేశాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో బతికున్న బల్లిని అమాంతంగా మింగేశాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని మల్లవాన్ ప్రాంతానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తిని అత్యాచారం కేసులో పోలీసులు సోమవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో వారు నిందితుడ్ని జైలుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంతలో జైల్లో ఎన్ని బాధలు పడాల్సి వస్తుందోనని భయపడిన మహేష్‌ అక్కడే బతికి ఉన్న బల్లిని మింగేశాడు. వెంటనే పోలీసులు మహేష్‌ను చికిత్స నిమిత్తం భిటార్‌గావ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి మహేశ్‌ కడుపులోని బల్లిని బయటకు తీశారు. ప్రస్తుతం మహేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బల్లిని ఎందుకు మింగావని పోలీసులు మహేష్‌ను ప్రశ్నించగా, జైలుకు తీసుకెళ్తారని భయంతోనే అలా చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...