Steel Bridge Effect: 10దాటితే స్టీల్ బ్రిడ్జ్‌పై పరేషానే.. దెబ్బకు ఏం చేశారో తెలుసా.!

|

Aug 26, 2023 | 10:03 PM

హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరా పార్క్‌ - వీఎస్టీ మధ్య నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిను ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి దివంగత మాజీ హోంమత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. 450 కోట్ల రూపాయలతో దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు.

హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరా పార్క్‌ – వీఎస్టీ మధ్య నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిను ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి దివంగత మాజీ హోంమత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. 450 కోట్ల రూపాయలతో దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో కొత్త తిప్పలు మొదలయ్యాయి. బ్రిడ్జిని ఆనుకొని ఎన్నో లేడీస్ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ లేడీస్ హాస్టళ్ళే టార్గెట్‌గాపోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళ్ళ మద్యం మత్తుల్లో వీరంగం సృష్టిస్తున్నారు. తాజా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి హాస్టల్లోని అమ్మాయిలపైకి బీర్ బాటిల్ విసిరారు. ఈ దృశ్యాలు హాస్టల్ పరిసరాల్లో ఉన్న బేకరీ వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వరుస ఘటన జరుగుతుండటంతో హాస్టళ్ళల్లోని అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం కాస్తా పోలీసులకు చేరడంతో రాత్రివేళ స్టీల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్టీల్ బ్రిడ్జిపై ఎలాంటి వాహనాల రాకపోకలు ఉండవని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల నిర్ణయంపై సవాలక్ష సందేహాలు మొదలయ్యాయి. ఆకతాయిలను నియంత్రించడం మానేసి… బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...