Drunk Woman: ఫుల్లుగా మందుకొట్టి విమానం ఎక్కిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగింగో మీరే చూడండి!

|

Sep 09, 2024 | 11:37 AM

మద్యం సేవించిన తర్వాత కొందరు వ్యక్తులు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా మద్యం పొట్టలోకి వెళ్లిందంటే మనుషులను నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఒక్కోసారి తమని తామే మర్చిపోతారు కొందరు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మందుకొట్టి విమానం ఎక్కిన ఓ యువతి తనను తాను మర్చిపోయింది. తాను వెళ్లాల్సింది ఒక దేశమైతే..

మద్యం సేవించిన తర్వాత కొందరు వ్యక్తులు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా మద్యం పొట్టలోకి వెళ్లిందంటే మనుషులను నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఒక్కోసారి తమని తామే మర్చిపోతారు కొందరు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మందుకొట్టి విమానం ఎక్కిన ఓ యువతి తనను తాను మర్చిపోయింది. తాను వెళ్లాల్సింది ఒక దేశమైతే.. ఇంకో దేశానికి వెళ్లే విమానం ఎక్కేసింది. విమానంలో మగతగా కూర్చున్న ఆమె.. పైలట్ హిందీలో మాట్లాడుతూ ప్రయాణికులకు సూచనలు చెప్పగానే ఉలిక్కిపడింది. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె జార్జియా వెళ్లేందుకు ఫ్లైట్‌ బుక్‌ చేసుకొని ఇండియా వెళ్లే విమానం ఎక్కింది. మీరు జార్జియాకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కానీ తాగిన మత్తులో ఇండియా వెళ్లే విమానంలో కూర్చున్నారు. మీకు తెలుసా? నిజానికి ఈ విమానం ఇండియా వెళ్తోందని’ అని ఆ వీడియోపై రాసుకొచ్చారు. ఈ వీడియోను 3 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు..మద్యం సేవించి మత్తులో ఉన్నవారిని కూడా విమానం ఎక్కిసారా? అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఎలాగూ ఇండియా వస్తున్నారు కాబ్టటి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయని, వాటిని చూసి వెళ్లాలని సూచించారు. కొందరు మాత్రం ఈ మహిళ కంటే బోర్డింగ్ పాస్ చేసిన వారే ఎక్కువగా తాగి ఉంటారని, అందుకే ఈ పొరపాటు జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.