Uttar Pradesh: సినిమాకు వెళ్తుండగా గుండెపోటు.. కుప్పకూలిన యువకుడు.వీడియో..

|

Aug 31, 2023 | 10:23 PM

ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. డ్యాన్స్, వ్యాయామం వంటివి చేస్తుండగానే మరణిస్తున్న ఘటనలు తీవ్ర షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయిన వీడియో వైరల్‌గా మారింది.

ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. డ్యాన్స్, వ్యాయామం వంటివి చేస్తుండగానే మరణిస్తున్న ఘటనలు తీవ్ర షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయిన వీడియో వైరల్‌గా మారింది. గదర్‌ -2 చిత్రాన్ని వీక్షించేందుకు శనివారం రాత్రి సినిమా హాలులోకి ప్రవేశించిన 35 ఏళ్ల యువకుడు రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడిని మహేవగంజ్‌లో మెడికల్ స్టోర్ నడుపుతున్న అక్షత్ తివారీగా గుర్తించారు. అతడు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి చేరుకొని ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. సినిమా హాలులో ఉన్న గార్డులు, బౌన్సర్లు అక్కడికి చేరుకొని అతడి ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు ప్రయత్నించినా ఎలాంటి చలనం లేకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్లే తివారీ ప్రాణాలు విడిచాడని ప్రాథమికంగా నిర్థారించారు. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర, మధుమేహం, రక్తపోటు వంటి వైద్య పరిస్థితులు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడమే యువతలో గుండెపోటుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..