Pizza-lottery: అదృష్టం అంటే ఇలా ఉండాలి.. పిజ్జా తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.40 లక్షలు..

అదృష్టం ఏ క్షణంలో ఎవరిని ఎలా టచ్‌ చేస్తుందో తెలీదు. ఇదిగో ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. అదృష్టం అంటే అలా ఉండాలి అంటున్నారు నెటిజన్లు ఈ విషయం తెలుసుకొని. ఎందుకంటే..

Pizza-lottery: అదృష్టం అంటే ఇలా ఉండాలి.. పిజ్జా తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.40 లక్షలు..

|

Updated on: Sep 21, 2022 | 9:40 AM


అదృష్టం ఏ క్షణంలో ఎవరిని ఎలా టచ్‌ చేస్తుందో తెలీదు. ఇదిగో ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. అదృష్టం అంటే అలా ఉండాలి అంటున్నారు నెటిజన్లు ఈ విషయం తెలుసుకొని. ఎందుకంటే.. పిజ్జా కొందామని వెళ్లిన మహిళకు లక్షల రూపాయలు వచ్చిపడ్డాయి మరి. ఇదెవరైనా ఊహిస్తారా.. చెప్పండి.. అసలు విషయానికి వస్తే..అమెరికాలోని సౌత్ కరోలినాలో స్వాన్సియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఏదో పనిమీద బయటికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు పిజ్జా తీసుకెళదామని భావించింది. స్వాన్సియాలోని రెయిన్ బో గ్యాస్ స్టేషన్ వద్ద రెస్టారెంటుకు వెళ్లి పిజ్జాలకు ఆర్డర్ చేసింది. పిజ్జాలు రెడీ అవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పడంతో కాసేపు ఆ ఆవరణలో తచ్చాడటం మొదలుపెట్టింది. అక్కడ సౌత్ కరొలినా ఎడ్యుకేషన్ లాటరీకి సంబంధించి టికెట్లను విక్రయించడం చూసింది. ఏదో సరదాకి ప్రయత్నిద్దామని రెండు డాలర్లు అంటే సుమారు 160 రూపాయలు పెట్టి జంబో బక్స్ టికెట్లు కొనుగోలు చేసింది. అవి స్క్రాచ్ కార్డు టైప్ టికెట్లు. ముందుగానే లాటరీ ప్రైజ్ వచ్చే నంబర్లు ఎంపికై ఉంటాయి. టికెట్లను అప్పటికప్పుడు స్క్రాచ్ చేసి చూసుకుని.. ఆ నంబర్ ఉంటే బహుమతి తీసేసుకోవచ్చన్న మాట. అయితే సదరు మహిళ అప్పటికప్పుడే టికెట్లను స్క్రాచ్ చేయలేదు. పిజ్జాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేశాక.. టికెట్లను స్క్రాచ్ చేశారు. అందులో నంబర్లను, బహుమతి వచ్చే నంబర్లను సరిచూసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ టికెట్ కు 50 వేల డాలర్లు అంటే సుమారు 40 లక్షల రూపాయలు లాటరీ తగలిగింది. మొదట తన కుటుంబ సభ్యులు లాటరీ తగిలిందంటే నమ్మలేదని.. నంబర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఎగిరి గంతేశారని ఆమె చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us