Child Birth: విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఆమెకు తను గర్భవతి అనే తెలియదట..
విమాన ప్రయాణంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. 'తమరా' అనే మహిళ విమానంలోని వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సదరు మహిళకు తను గర్భవతి అన్న విషయమే తెలియదట.
విమాన ప్రయాణంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ‘తమరా’ అనే మహిళ విమానంలోని వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సదరు మహిళకు తను గర్భవతి అన్న విషయమే తెలియదట. తను గర్భవతి అని తెలియకుండానే విమానంలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌లోని గుయాక్విల్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్తున్న డచ్ విమానం KLM రాయల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఈక్వెడార్ నుంచి స్పెయిన్‌కు వెళుతోంది. ఆమ్‌స్టర్‌డామ్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ మహిళకు కడుపునొప్పి వచ్చింది.హార్లెమ్ స్యూడ్ హాస్పిటల్ ప్రతినిధి స్పార్నే గస్తుయిస్ NL టైమ్స్‌కు తెలిపిన వివరాల ప్రకారం,ఆ మహిళ తనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పింది. తామరాకు తాను గర్భవతి అని తెలియదని, ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వైద్యులు ఒక నర్సు విమానంలో ఉన్నారు. యువతికి అవసరమైన సంరక్షణ అందించామని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. వైద్యులు, నర్సులకు విమానయాన సంస్థ రుణపడి ఉంటుందని కూడా ప్రతినిధి తెలియజేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..