Viral: భర్తపై ఓ మహిళ విచిత్ర ఆరోపణ.! 500 మందితో అఫైర్ ఉందని..

|

Feb 03, 2024 | 6:05 PM

తమిళనాడుకు చెందిన ఓ మహిళ భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ఏకంగా 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తంజావూరుకు చెందిన ఆర్తి మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో పిటిషన్ వేస్తూ.. తన భర్త వివేక్‌రాజ్‌కు 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆరో పించింది. ఆయన మొబైల్ ఫోన్‌లో దాదాపు 1000 వరకు అశ్లీల వీడియోలు ఉన్నాయని, అసభ్యకరంగా ఉన్న వీడియోకాల్ స్క్రీన్‌షాట్లు, ఫొటోలు ఉన్నట్టు పేర్కొంది.

తమిళనాడుకు చెందిన ఓ మహిళ భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ఏకంగా 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తంజావూరుకు చెందిన ఆర్తి మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో పిటిషన్ వేస్తూ.. తన భర్త వివేక్‌రాజ్‌కు 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆరో పించింది. ఆయన మొబైల్ ఫోన్‌లో దాదాపు 1000 వరకు అశ్లీల వీడియోలు ఉన్నాయని, అసభ్యకరంగా ఉన్న వీడియోకాల్ స్క్రీన్‌షాట్లు, ఫొటోలు ఉన్నట్టు పేర్కొంది. ఈ విషయమై భర్తతోపాటు అత్తమామలను ప్రశ్నిస్తే ఎవరికీ చెప్పవద్దని తనను బెదిరించారని ఆర్తి ఆరోపించింది. తాను రెండు నెలల గర్బంతో ఉన్పప్పుడు తనపై భర్త దాడిచేయడంతో అబార్షన్ అయిందని, తంజావూరు ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయినా ఎవరూ పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. తన భర్త వ్యవహారంపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రాగా దీనిపై జవాబివ్వాలని తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీని న్యాయస్థానం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos