Viral: వాగు దాటుతుండగా పురుటి నొప్పులు.. ఒడ్డుపైనే ప్రసవించిన గర్భిణి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో..

|

Jul 22, 2022 | 8:29 AM

ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వాగు దాటుతుండగా పురిటి నొప్పులు.. ఒడ్డుపైనే ప్రసవం @TV9 Telugu Digital
ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు వెళ్లాలంటే వృద్ధులు, గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలో ఓ గర్భిణి వాగు దాటుతుండగా పురిటి నొప్పులు రావడంతో వాగు గట్టునే ప్రసవించింది. ఈ దయనీయ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ మామిడిగూడ కు చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. జూలై 18 ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామస్థులు ఆమెను ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మామిడిగూడ వాగు దాటుతుండగా ఉన్నట్టుండి గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దాంతో ఆమె వాగు ఒడ్డునే ప్రసవించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్‌, వాల్గొండ ఏఎన్‌ఎం జానాబాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు. గ్రామస్థుల సాయంతో తల్లి, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 22, 2022 08:29 AM