Viral: పోలీస్‌కు నడిరోడ్డుపై చెప్పు దెబ్బ కొట్టిన మహిళా..! ఏం జరిగిందంటే..?

|

Oct 16, 2023 | 8:38 AM

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ నడిరోడ్డుపై రెచ్చిపోయింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసింది. ఓ కానిస్టేబుల్‌ చెంప ఛెళ్లుమనిపించింది. మరో పోలీసును కిందకు నెట్టేసి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టిం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన ఘజియాబాద్ లో అక్టోబరు 10న చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనపై యూపీ పోలీసులు స్పందించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ నడిరోడ్డుపై రెచ్చిపోయింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసింది. ఓ కానిస్టేబుల్‌ చెంప ఛెళ్లుమనిపించింది. మరో పోలీసును కిందకు నెట్టేసి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టిం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన ఘజియాబాద్ లో అక్టోబరు 10న చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనపై యూపీ పోలీసులు స్పందించారు. ఈ వీడియోలో దాడి చేస్తున్న మహిళ పేరు మిథిలేష్.. ఈ-రిక్షా డ్రైవర్. తన ఈ రిక్షాలో ఎక్కడికో వెళ్తున్న మహిళను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆమె ఈ రిక్షాకు నెంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో బండి పక్కన పెట్టాలని సూచించారు. అందుకు నిరాకరిస్తూ కానిస్టేబుల్ తో మిథిలేష్ వాగ్వాదానికి దిగింది. ఆక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసింది. చెప్పు తీసుకుని కొడుతూ, అసభ్య పదజాలంతో తిట్టింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో పోలీసు అధికారిని రోడ్డుపై పడదోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మిథిలేష్ ను అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..