King Cobra: వామ్మో..13 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా పట్టుకున్నారో చూస్తే దిమ్మ తిరగాల్సిందే.!

|

Aug 06, 2023 | 9:24 AM

వర్షపు నీటి తో నిండిన పొలం కావడంతో చిక్కినట్టే చిక్కి చేజారుతూ వచ్చింది. దానికి తోడు పదే పదే బుసలు కొడుతూ పై పైకి ఎగబడడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. పారిపోతున్న కోబ్రా తోకను స్నేక్‌ క్యాచర్‌ పట్టుకోగా అది అంతే వేగంతో ఎదురు దాడికి ప్రయత్నించింది. చివరకు యువకులు చాకచక్యంగా పట్టుకుని సమీపం లో ఉన్న అటవీ ప్రాంతం లో విడిచి పెట్టారు.

విశాఖ జిల్లా లో పొలానికి వెళ్లిన ఓ రైతు కంటపడింది 13 అడుగుల కింగ్ కోబ్రా. అదృష్టవశాత్తు తృటిలో దాని బారి నుంచి తప్పించుకున్నారు. చీడికడ మండలం తురువోలు గ్రామంలోని ఓ పొలంలో ఈ ఘటన జరిగింది. ఆ రైతు వెంటనే పక్క పొలాల్లో ఉన్న రైతులకు చెప్పడంతో స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అయితే దాన్ని పట్టుకునేందుకు ఆ స్నేక్ క్యాచర్స్‌కు తల ప్రాణం తోకకొచ్చింది. చాలా రిస్క్ చేయాల్సి వచ్చింది. వర్షపు నీటి తో నిండిన పొలం కావడంతో చిక్కినట్టే చిక్కి చేజారుతూ వచ్చింది. దానికి తోడు పదే పదే బుసలు కొడుతూ పై పైకి ఎగబడడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. పారిపోతున్న కోబ్రా తోకను స్నేక్‌ క్యాచర్‌ పట్టుకోగా అది అంతే వేగంతో ఎదురు దాడికి ప్రయత్నించింది. చివరకు యువకులు చాకచక్యంగా పట్టుకుని సమీపం లో ఉన్న అటవీ ప్రాంతం లో విడిచి పెట్టారు. ఇటీవల కాలంలో వర్షాలు పెద్ద ఎత్తున పడి వరదలు రావడంతో అటవీ ప్రాంతాల నుంచి కోబ్రా లు కొట్టుకు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...