woman in funeral: సోదరుడి అంత్యక్రియల్లో.. యువతి ఏం చేసిందంటే.. వైరల్ గా మారిన వీడియో..

|

Oct 04, 2022 | 8:33 PM

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఈ ఆందోళనల్లో మరణించిన ఓ యువకుడి అంత్యక్రియల్లో అతడి సోదరి జుట్టు కత్తిరించి నిరసన తెలిపిన


ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఈ ఆందోళనల్లో మరణించిన ఓ యువకుడి అంత్యక్రియల్లో అతడి సోదరి జుట్టు కత్తిరించి నిరసన తెలిపిన వీడియో వైరల్‌గా మారింది. జావెద్‌ హైదరీ ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయాడు. జావెద్‌ అంత్యక్రియల సమయంలో అతడి సోదరి కన్నీరు కార్చింది. ఆమె తన జట్టును కత్తిరించి జావెద్‌ మృతదేహంపై పడేసింది. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. ఈ ఆందోళనల్లో దేశవ్యాప్తంగా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకొని హింసించడంతో మరణించింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. చాలా మంది మహిళలు ఇరాన్‌లోని చట్టాలను వ్యతిరేకిస్తూ తమ జట్టును కత్తిరించుకొంటున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చాలా మంది నిరసనల్లో హిజాబ్‌లను మంటల్లోకి విసురుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 04, 2022 08:33 PM