Banana Phython Snake: వామ్మో.. మన కళ్లనే మోసం చేస్తోందిగా.. అరటిపండు అనుకుంటే అంతే సంగతులు..!

|

Oct 06, 2022 | 8:24 PM

ఈ వీడియో చూసిన వారందరూ కూడా మొదట దానిని అరటి పండే అనుకుంటారు. చేత్తో పట్టుకున్నప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. అయితే


నెట్టింట్లో నిత్యం చిత్ర విచిత్రమైన ఫొటోలు, వీడియోలు షేర్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌ కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు భయం పుట్టిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూడగానే మనకు రెండు అరటి పండ్లు ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కళ్లతో చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. ఇందులో ఒకటి మాత్రమే అరటి పండు. పక్కనే అచ్చం అరటి పండులాగే కనిపిస్తున్నది ఒక పాము. ఈ వీడియో చూసిన వారందరూ కూడా మొదట దానిని అరటి పండే అనుకుంటారు. చేత్తో పట్టుకున్నప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే నోటి భాగం నుంచి నాలుక బయటకు వస్తుందో అది పాము అని నమ్ముతారు. కాగా అచ్చం అరటిపండులా కన్పిస్తున్నందున.. ఈ పాముని బనానా పైథాన్ అంటున్నారు. ఇవీ ఎక్కువగా అటవీ ప్రాంతంలో అరటి తోటల్లో సంచరిస్తుంటాయి. సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నాం’, ‘ పామును చూస్తుంటే చాలా భయంగా ఉంది’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 06, 2022 08:24 PM