Bus conductor: ప్రయాణికులంటే మరీ ఇంత చులకనా.. కండక్టర్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

Updated on: Sep 17, 2022 | 9:38 AM

‘ప్రయాణీకులే మా దేవుళ్లు, వారిని గమ్య స్థానాలకు చేర్చడమే మా పని’ అనే స్లోగన్స్ ను మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తూనే ఉంటారు. ప్రయాణీకులకు మర్యాద ఇచ్చి వారితో గౌరవంగా నడుచుకుంటారు.


‘ప్రయాణీకులే మా దేవుళ్లు, వారిని గమ్య స్థానాలకు చేర్చడమే మా పని’ అనే స్లోగన్స్ ను మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తూనే ఉంటారు. ప్రయాణీకులకు మర్యాద ఇచ్చి వారితో గౌరవంగా నడుచుకుంటారు. అయినా కొన్ని సార్లు ప్రయాణీకులకు, బస్ కండక్టర్ మధ్య ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతుంటుంది. చిల్లర ఇవ్వలేదనో, మరో కారణంతోనో వాగ్వాదం జరగడం సహజం. కానీ ఓ కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల ప్రవర్తించిన తీరు తోటి ప్రయాణికులకే కాదు నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తుంది. అసలేం జరిగిందంటే..నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి, బస్సు కండక్టర్‌కి మధ్య గొడవ జరుగుతుంది. అతనిని బస్సు దిగిపోవాలని కండక్టర్ సూచించాడు. అయితే అతడు కిందకు దిగేందుకు ఒప్పుకోడు. దీంతో కండక్టర్ తీవ్ర ఆగ్రహానికి గురై అతని చెంపపై గట్టిగా కొట్టాడు. అతనిని చెంపదెబ్బ కొట్టడమే కాకుండా బస్సులోంచి కిందికి దింపేసాడు. కాలితో తన్ని దారుణంగా ప్రవర్తించాడు. డోర్ మూసేసి బస్ డ్రైవర్‌ను వెళ్లమని చెప్పాడు. కింద పడిపోయిన ప్రయాణికుడ్ని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కండక్టర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రయాణికుడి పట్ల అతను వ్యవహరించిన తీరు సరిగా లేదని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 17, 2022 09:38 AM