Union Minister-Corn Selling Boy: మన దగ్గర బేరాల్లేవమ్మా.. మంత్రయినా ఎవరైనా ఒకటే రేటు.. దిమ్మదిరిగే పంచ్‌ ఇచ్చిన కుర్రాడు

|

Jul 26, 2022 | 5:24 PM

మొక్కజొన్న కంకులు అమ్మే ఓ కుర్రాడు కేంద్రమంత్రికి దిమ్మదిరిగే సమాధానమిచ్చి వార్తల్లో నిలిచాడు. ఆ కుర్రాడు ఇచ్చిన పంచ్‌కి సదరు మంత్రి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. అసలేం జరిగిందంటే...


మొక్కజొన్న కంకులు అమ్మే ఓ కుర్రాడు కేంద్రమంత్రికి దిమ్మదిరిగే సమాధానమిచ్చి వార్తల్లో నిలిచాడు. ఆ కుర్రాడు ఇచ్చిన పంచ్‌కి సదరు మంత్రి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. అసలేం జరిగిందంటే… కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే కారులో వెళ్తూ రోడ్డు పక్కన ఓ కుర్రాడు మొక్కజొన్న కంకులు కాలుస్తుండడం గమనించారు. వాటిని చూడగానే మంత్రిగారికి మనసులాగినట్లుంది.. కారు దిగి వచ్చి మూడు కంకులు అడిగి కాల్పించుకున్నారు. కుర్రాడు కూడా చక్కగా కంకులు కాల్చి నిమ్మరసం.. ఉప్పు, కారం రాసి కేంద్ర మంత్రికి ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మంత్రి బేరమాడడం మొదలుపెట్టారు.మొదట ఒక్క కంకి ఎంత? అని కేంద్ర మంత్రి అడగ్గా.. 15 రూపాయలు అని కుర్రాడు జవాబిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన మంత్రి ‘ఒక్కోటి పదిహేను రూపాయలా.. అంటే ఇప్పుడు నేను మూడింటికీ 45 రూపాయలు ఇవ్వాలా?’ అని అడుగుతారు. దీనికి బదులుగా ఆ కుర్రాడు.. సార్‌..‘ ఆ కండి స్టాండర్డ్‌ రేటు 15 రూపాయలు. మీరు కారులో వచ్చారని, మీ కారును చూసి నేను ఆధర చెప్పలేదు మీకు’ అంటూ సమాధానమిచ్చాడు. ఆ కుర్రాడిచ్చిన పంచ్‌కి నోటమాట రాలేదు మంత్రికి. ఆ కుర్రాడు అడిగినంత డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా కేంద్రమంత్రి స్వయంగా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. ‘ఈరోజు సియోని నుంచి మాండ్లాకు వెళుతున్నాను. స్థానిక మక్కకంకులను రుచి చూశాను. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధినిస్తుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే కేంద్రమంత్రి అయ్యి ఉండి ఓ రోడ్డు పక్కన కుర్రాడితో బేరాలాడడం అసలేమీ బాగోలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 26, 2022 05:24 PM