Student – Teacher: స్టూడెంట్ కొట్టిన కొట్టుడికి కోమాలోకి వెళ్లిన టీచర్..! ఎందుకంటే..

|

Mar 09, 2023 | 9:42 AM

ఆచార్య దేవోభవ అంటూ గురువును గౌరవించడం మన సంప్రదాయం. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం అసిస్టెంట్ టీచర్ ను శత్రువులా చూశాడు. తన వీడియో గేమ్ తీసుకోవడంతో పట్టరాని

ఆచార్య దేవోభవ అంటూ గురువును గౌరవించడం మన సంప్రదాయం. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం అసిస్టెంట్ టీచర్ ను శత్రువులా చూశాడు. తన వీడియో గేమ్ తీసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో రెచ్చిపోయి దాడి చేశాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. షెరిఫ్ కార్యాలయం ఈ దాడికి సంబంధించి వీడియో విడుదల చేసింది. స్కూల్లో వీడియో గేమ్ ఆడుతుండడంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని స్వాధీనం చేసుకుని ముందుకు వెళుతున్నారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి, టీచర్ ను గట్టిగా తోసేయడంతో ఆమె ఎగిరి అంత దూరంలో కిందపడిపోయింది. తల నేలను గట్టిగా తాకడంతో స్పృహ కోల్పోయింది. అయినా విద్యార్థి ఆగలేదు. ఆమె వీపు భాగంలో పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేస్తూనే ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారు అతడ్ని ఏదో విధంగా కొంత సమయానికి నిలువరించారు.‘‘ఇది హత్య లాంటిదే. ఎవరినైనా అలా కిందకు తోసినప్పుడు, వారి తల నేలను తాకినప్పుడు ఫలితాన్ని ఊహించలేం’’ అని షెరిఫ్ రిక్ ప్రకటించారు. అసిస్టెంట్ టీచర్ ను హాస్పిటల్ లో చేర్పించగా, పక్కటెముకలు విరిగినట్టు గుర్తించి వైద్యం అందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 09, 2023 09:42 AM