Viral: నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!

|

Oct 15, 2024 | 5:29 PM

రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కారు అలాగే మండుతూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆ భయానక వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ లో చోటుచేసుకుంది. అజ్మీర్ కల్వర్టు దగ్గర కదులుతున్న కారులో మంటలు చెలరేగడం చూసి..

రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కారు అలాగే మండుతూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆ భయానక వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ లో చోటుచేసుకుంది. అజ్మీర్ కల్వర్టు దగ్గర కదులుతున్న కారులో మంటలు చెలరేగడం చూసి అదే దారిలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారంతా రోడ్డుపై పరుగులు తీశారు.

జైపూర్‌లో జితేందర్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా AC నుంచి పొగలు రావడం గమనించారు. వెంటనే కారును పక్కకు ఆపి బానెట్ తెరిచి పరిశీలించారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించాయి. దీంతో హ్యాండ్ బ్రేక్ దెబ్బతిని కారు ప్రధాన రహదారిపై నియంత్రణ లేకుండా ముందుకు కదిలింది. చివరకు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిసింది. చివరకు రోలింగ్‌ కారు డివైడర్‌ను ఢీకొని దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.