Kurnool: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.! అక్కడ ఏం ముట్టుకున్నా కళ్లు పోతాయట.!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం లోని గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజయనేయ స్వామి వెలిశాడు. ఈ దేవాలయంలో వెలిసిన అంజన్నని గ్రామస్తులందరు నడవలయ్య స్వామిగా పిలుచుకుంటారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. ఆ కొండ పై అడుగు పెట్టాలన్నా ఎంతో పవితంగ్రా ఉండాలని స్థానికులు నమ్ముతారు. కొండపైకి వెళ్లినవారు స్వామి దర్శనం చేసుకొని రావాలి తప్ప అక్కడి, రాళ్లనుకానీ, చెట్లను కానీ కనీసం తాకడానికి కూడా సాహసించరు. వాటిని తాకినా, చెట్ల కొమ్మలను నరికినా, వారి […]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం లోని గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజయనేయ స్వామి వెలిశాడు. ఈ దేవాలయంలో వెలిసిన అంజన్నని గ్రామస్తులందరు నడవలయ్య స్వామిగా పిలుచుకుంటారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. ఆ కొండ పై అడుగు పెట్టాలన్నా ఎంతో పవితంగ్రా ఉండాలని స్థానికులు నమ్ముతారు. కొండపైకి వెళ్లినవారు స్వామి దర్శనం చేసుకొని రావాలి తప్ప అక్కడి, రాళ్లనుకానీ, చెట్లను కానీ కనీసం తాకడానికి కూడా సాహసించరు. వాటిని తాకినా, చెట్ల కొమ్మలను నరికినా, వారి కళ్లు పోతాయని స్థానికుల ప్రగాఢ నమ్మకం. పూర్వీకులనుంచే అక్కడ ఈ ఆచారం పాటిస్తున్నట్టు స్థానికులు చెబుతారు.
ఆ కొండ మీద ఆకులు కానీ, కట్టెలు కానీ, రాళ్లు కానీ ఏది ముట్టుకున్నా దేవుడి ఆగ్రహానికి గురవుతారని , కళ్ళు పోతాయని గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు. కొండపై ఎంతో అటవీ సంపద ఉన్నా ఏ ఒక్కరూ దానిని ముట్టుకోడానికి కూడా ఇష్టపడరు. ఊరిలో ఎంత కరువు వచ్చినా, ఎవరైనా సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నా కూడా ఆ కొండపై నుంచి చిన్న రాయి ముక్క కూడా తీసుకురారు. ఎవరైనా ఇదంతా మూఢనమ్మకం అలాంటిదేమీ జరగదు అంటూ కొండపైనుంచి ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వారికి కళ్ళు పోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చదువుకున్న యువకులు, విద్యావంతులు ఎందరో ఉన్నా, పూర్వీకులనుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.