Funeral Startup: ముంబైలో కర్మకాండలు చేసే స్టార్టప్.! ₹35 వేల నుంచి ₹50 వేలు వసూలు.. వీడియో.
ముంబైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ బిజినెస్ మోడల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ, ఆ కంపెనీ ఎలాంటి సేవలందిస్తోందో తెలుసా? ఆత్మీయుల్ని కోల్పోయి..
ముంబైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ బిజినెస్ మోడల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ, ఆ కంపెనీ ఎలాంటి సేవలందిస్తోందో తెలుసా? ఆత్మీయుల్ని కోల్పోయి.. బాధలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్మకాండలు జరిపిస్తామని చెబుతోంది. ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీ కర్మకాండలతోపాటు, అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలను అందిస్తామని చెబుతోంది.ఈ స్టార్టప్‌కు సబంధించిన ఫొటోను అవనీష్ వైష్ణవ్ అనే ఐఏఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ఇలాంటి స్టార్టప్ అవసరం ఉందా?’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘‘భవిష్యత్తులో అద్దె మనుషులు వచ్చి మన చివరి ప్రయాణంలో పాల్గొంటారు అని మా కుటుంబసభ్యులు చెబుతుండేవారు. ఇప్పుడది నిజమే అనిపిస్తోంది’’, ‘‘ఇలాంటి సేవలు భారత్‌లో కొత్త కావచ్చు. అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి’’, చివరి రోజుల్లో తమ గురించి పట్టించుకునేవారు లేక చాలా మంది ఒంటరిగా ఫీలవుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ స్టార్టప్ సేవలు’’, అని ట్వీట్లు చేస్తున్నారు. కర్మకాండల సేవల కోసం ఈ కంపెనీ సుమారు ₹ 35 వేల నుంచి ₹ 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తోందని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..