Abu Dhabi Restaurant: షాకింగ్..! 14 మంది ఫుడ్‌కి రూ.1.3 కోట్ల బిల్.. నెటిజన్లు ఫైర్.. వైరల్ వీడియో
అబుధాబిలోని రెస్టరెంట్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన పార్టీకి అయిన బిల్ చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేవలం 14 మంది తిన్న ఫుడ్‌కు అంత ధరా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాల్ట్ బేగా పాపులర్ అయిన ప్రముఖ చెఫ్ నస్రత్ గోక్సెకు చెందిన రెస్టరెంట్‌లో 14 మందికి ఫుడ్ ఆర్డర్ చేసినట్లు బిల్‌లో ఉంది. వారు, ఆహారంతోపాటు వైన్ కూడా ఆర్డర్ చేశారు. వాటిలో అత్యంత పాపులర్ బోర్డియక్స్, బక్లావా వైన్, 24 క్యారెట్ గోల్డ్‌తో కోటింగ్ చేసిన స్టీక్ ఫుడ్ అనే ఒక రకమైన మాంసం వంటకంతో పాటు ఇతర వంటకాలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి 6,15,065 దర్హామ్‌లు అయింది. అంటే, మన కరెన్సీలో సుమారు 1.3 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ మొత్తం వైన్‌కు, స్టీక్‌కు చెల్లించారు.ఈ బిల్లును నస్రత్ గోక్సె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బిల్లు చూసి నెటిజన్లు ఫుడ్, వైన్ ధరలపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ డబ్బుతో ఓ గ్రామానికి సహాయం చేయొచ్చు’, ‘నీ రెస్టరెంట్ కేవలం సంపన్నుల కోసమేనా?, సామాన్యులకు కాదా?’, ‘వైన్, మాంసానికి ఇంత ధరా? వాటినేమైనా అంతరిక్షం నుంచి తెచ్చావా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

