Viral: మృతకళేబరాలను తినే కొంగల జాతి.. వాటి ఉనికిని కాపాడిన ఆమెకు ఎన్ని అవార్డులైనా సరిపోవు..

|

May 01, 2022 | 5:38 PM

అస్సాంలో అరుదైన కొంగలు అంతరించిపోకుండా గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది ఓ మహిళ. 2007లో వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు మాత్రమే కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి.


అస్సాంలో అరుదైన కొంగలు అంతరించిపోకుండా గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది ఓ మహిళ. 2007లో వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు మాత్రమే కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. మృతకళేబరాలను తిని శుభ్రం చేసే పారిశుద్ధ్య కొంగలు తేమ అడవుల స్థానంలో ఊళ్లు రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే మృతకళేబరాలను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెచ్చేటప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది కనుక పక్షులను దుశ్శకునంగా భావించే గ్రామస్తుల మనసుల్ని మార్చింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కావని – బాబర్‌ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పేది. ‘అరణ్యక్‌’ ఎన్జీవోను స్థాపించి అస్సాం గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. మహిళలకు మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఎర్త్‌ డే సందర్భంగా ఏప్రిల్‌ 22న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌ ‘వన్‌ ఫర్‌ చేంజ్‌’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్‌ ఫిల్మ్‌ ప్రసారం చేయనుంది. అందులో ఒకరు పూర్ణిమ బర్మన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..