Taj Mahal for Mother: అమ్మకు ప్రేమతో తాజ్‌మహల్ నిర్మించిన కొడుకు.. వేలాదిగా వస్తున్న సందర్శకులు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన తల్లిపై ప్రేమతో తాజ్‌మహల్‌ను తలపించే భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఈ మినీ తాజ్‌మహల్ తిరువారూర్ జిల్లాలో ఉంది.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన తల్లిపై ప్రేమతో తాజ్‌మహల్‌ను తలపించే భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఈ మినీ తాజ్‌మహల్ తిరువారూర్ జిల్లాలో ఉంది. వ్యాపారవేత్త అమృతిన్ షేక్ దావూద్ తల్లి జైలానీ భివి 2020లో మరణించారు. తన బిడ్డల కోసం తల్లి త్యాగానికి చిహ్నంగా, ఆమె జ్ఞాపకార్థం ఒక ఆర్కిటెక్ట్‌ను నియమించి రాజస్థాన్‌లోని తెల్లని పాలరాయితో తాజ్ మహల్ లాంటి భవనాన్ని నిర్మించారు. తన తండ్రి మరణించినప్పుడు షేఖ్ దావూద్ వయస్సు కేవలం 11 సంవత్సరాలు. అప్పటి నుండి తల్లి జైలానీ బీవీ, వారి కుటుంబానికి జీవనాధారంగా ఉన్న హార్డ్‌వేర్ వ్యాపారాన్ని ఒంటరిగా చేపట్టింది. నలుగురు కుమార్తెలు ఒక కుమారుడిని కష్టపడి పెంచి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి శ్రమించింది. తాజ్ మహల్ రూపం లో ఉన్న స్మారక మందిరం నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు.. వందల సంఖ్యలో కార్మికుల సహాయంతో పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. జూన్ 2, 2023న ప్రజల సందర్శనార్ధం ఈ స్మారక మందిరం తలుపులు తెరిచి ఉంచారు. ఈ మినీ తాజ్ మహల్‌ను సందర్శించి, నివాళులర్పించేందుకు అన్ని మతాల వారికి స్వాగతం అంటూ ప్రకటించారు. కొడుకు తన తల్లి జ్ఞాపకంగా నిర్మించిన ఈ మినీ తాజ్ మహల్ చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!