Anand Mahendra: లెక్కల మాస్టర్‌ తెలివికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా..! డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్…

|

Jul 25, 2022 | 9:03 PM

టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరు. ఆ ట్యాలెంట్‌ను గుర్తించి ప్రజల్లోకి తీసుకురావడమే ఆయన ప్రత్యేకత. తన సోషల్‌ మీడియా వేదికగా అలాంటి ఎన్నో వీడియోలను పంచుకున్నారు..


టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరు. ఆ ట్యాలెంట్‌ను గుర్తించి ప్రజల్లోకి తీసుకురావడమే ఆయన ప్రత్యేకత. తన సోషల్‌ మీడియా వేదికగా అలాంటి ఎన్నో వీడియోలను పంచుకున్నారు.. వారిని ప్రోత్సహించారు కూడా. తాజాగా ఓ లెక్కల మాస్టారు తయారు చేసిన కారుకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్‌లో పంచుకున్నారు. ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. అయితే శ్రీ నగర్‌కు చెందిన ఓ లెక్కల టీచర్‌ ఆ మాటను అక్షరాలా పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ విన్నూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.ఈ లెక్కడ మాస్టారి ట్యాలెంట్‌కి ఫిదా అయిపోయిన టెక్‌ దిగ్గజం.. అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. “బిలాల్ ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే అన్నారు. అంతేకాదు.. ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలంటూ… ఈ డిజైన్‌ మరింత అభివృద్ధి చేసేందుకు తమ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు. “ఇలాంటివి మార్కెట్ లోకి రావాలని తమ కామెంట్ల ద్వారా కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on