Dance Viral video: డ్యాన్సులందు ఈ డ్యాన్స్ వేరయా.. రామ్‌దేవ్ బాబాకు సవాలు అని నెటిజన్‌ కామెంట్‌..

సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ట్రెండ్ అవుతున్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియోలు కోకొల్లలు. ప్రస్తుతం అలాంటి ఓ డ్యాన్స్

Dance Viral video: డ్యాన్సులందు ఈ డ్యాన్స్ వేరయా.. రామ్‌దేవ్ బాబాకు సవాలు అని నెటిజన్‌ కామెంట్‌..

|

Updated on: Aug 28, 2022 | 9:14 AM


సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ట్రెండ్ అవుతున్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియోలు కోకొల్లలు. ప్రస్తుతం అలాంటి ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్యాన్స్ ను యువకుడు ఎలా చేశాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో వ్యక్తి తన చేతులపై నిలబడి, కాళ్లతో అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఈ క్లిప్ లో వ్యక్తి తన చేతులపై నిలబడతాడు. కాళ్లు పైకి లేపి బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. ఇక కాళ్లు ఊపుతూ డ్యాన్స్ చేస్తాడు. మ్యూజిక్ కు తగ్గట్టుగా చిందులేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.అద్భుతమైన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఆగస్టు 7న షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల మంది వీక్షించారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసి నా శరీరంలో డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం మొదలైందని ఒకరు, ఇది రామ్‌దేవ్ బాబాకు సవాలుగా మారిందని మరో వ్యక్తి తమ భావాలను పంచుకుంటున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us