Vande Bharat: లాగుడు బండిని ఢీకొట్టిన వందే భారత్ రైలు. ఘటనలో ముగ్గురు దుర్మరణం.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.. తన భార్యాబిడ్డలను బండిపై లాక్కెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మీరట్ సమీపంలోని కసమ్‌పూర్‌లోని రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.. తన భార్యాబిడ్డలను బండిపై లాక్కెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మీరట్ సమీపంలోని కసమ్‌పూర్‌లోని రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్‌కర్‌ఖేరా ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి భార్య మోనా, కుమార్తెలు మనీషా, చారూలను తన లాగుడు బండిపై కూర్చోబెట్టుకుని పని మీద బయటికి వచ్చాడు. కసమ్‌పూర్ రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర గేటు మూసి ఉండటంతో నరేష్ ఆ గేటు కింద నుంచి తన బండిని పట్టాలు దాటించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. దాంతో లాగుడు బండి ఎగిరిపోయి తునాతునకలు అయ్యింది. ఆ బండిలో ఉన్న మోనా, మనీషా, చారూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే, అప్పటికే బండిని లాగుతూ ట్రాక్‌ను దాటిన నరేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..