Viral: బిచ్చగాడిగా మారిన ఆస్తిపరుడైన ప్రభుత్వ ఉద్యోగి.. నా అనుకున్న వాళ్లే ఛీ పొమ్మన్నారు.

|

Aug 26, 2023 | 9:23 PM

ఒడిసాలో ప్రభుత్వ అధికారి ఒకరు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్న దీనగాథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..వ్యవసాయ కార్యాలయంలో ఉద్యోగం చేసిన లక్ష్మీకాంత్‌ ఉద్యోగ విరమణకు ఆరేళ్లు గడువు ఉండగానే రాజీనామా చేసి వెళ్లిపోయాడు. నాలుగు ఇళ్లు కొనుగోలు చేసి, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉండేవాడు. ఏం జరిగిందో.. మనస్తాపంతో కొన్నేళ్ల క్రితం ఇంటిని విడిచి వెళ్లిపోయాడు.

ఒడిసాలో ప్రభుత్వ అధికారి ఒకరు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్న దీనగాథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..వ్యవసాయ కార్యాలయంలో ఉద్యోగం చేసిన లక్ష్మీకాంత్‌ ఉద్యోగ విరమణకు ఆరేళ్లు గడువు ఉండగానే రాజీనామా చేసి వెళ్లిపోయాడు. నాలుగు ఇళ్లు కొనుగోలు చేసి, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉండేవాడు. ఏం జరిగిందో.. మనస్తాపంతో కొన్నేళ్ల క్రితం ఇంటిని విడిచి వెళ్లిపోయాడు. ఖుర్దాలో ఓ వృద్ధాశ్రమంలో చేరాడు. ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఆశ్రమాన్ని పునర్మిస్తామని చెప్పి ఖాళీ చేయించడంతో అక్కడ నుంచి సొంతింటికి వచ్చాడు. ఇంటికి వెళ్లగా తను చనిపోయాడని భార్య బొట్టు తీసేయడం, కుమారులు, కుమార్తెలు అతడి పట్ల కటువుగా ప్రవర్తించడంతో మరింత కుంగుబాటుకు లోనయ్యాడు. స్థానిక రాజ్‌మహల్‌ వద్ద ఉన్న విక్రమ్‌దేవ్‌ మహారాజా విగ్రహం వద్ద తలదాచుకుంటూ బిచ్చమెత్తుకుంటున్నాడు. పిల్లలను నమ్మి ఆస్తులు వారి పేరుమీద రాయొద్దంటూ వచ్చిపోయే వారికి చెబుతున్నాడు. కొందరు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆరా తీయగా, తన కథ చెప్పుకున్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మంగళవారం ఈవో సిద్ధార్థ్‌ లక్ష్మీకాంత్‌ వద్దకు వెళ్లి ఆశ్రమానికి తరలించారు. లక్ష్మీకాంత్‌ బాగోగులు తాము చూసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...