Viral Video: పండ్లు అమ్మే పెద్దావిడకు కోటీశ్వరుడి సర్ ప్రైజ్.! వృద్ధురాలి ముఖంలో నవ్వులు.
జాలి, దయతో చేసే చిన్న పనులు కూడా ఒక్కోసారి నైరాశ్యాన్ని దూరం చేసి జీవితంపై ఆశను మొలకెత్తిస్తాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఆశ్యర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా లుధియానాకు చెందిన ఓ వ్యక్తి.. పండ్లు అమ్ముకునే వృద్ధురాలి నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బిజినెస్ కన్సల్టెంట్, లుధియానా లైవ్ వ్యవస్ధాపకుడు కవల్ చబ్రా..
జాలి, దయతో చేసే చిన్న పనులు కూడా ఒక్కోసారి నైరాశ్యాన్ని దూరం చేసి జీవితంపై ఆశను మొలకెత్తిస్తాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఆశ్యర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా లుధియానాకు చెందిన ఓ వ్యక్తి.. పండ్లు అమ్ముకునే వృద్ధురాలి నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బిజినెస్ కన్సల్టెంట్, లుధియానా లైవ్ వ్యవస్ధాపకుడు కవల్ చబ్రా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా ఓ పెద్దావిడ చిన్న బండిపై పండ్లు అమ్ముకోవడం కంట కనిపించింది. పండ్ల ధరలు ఎంతో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లిన చబ్రా.. ఆమె వివరాలూ అడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా తాను ఇక్కడ పండ్లు అమ్ముతున్నానని, స్టాల్ వద్ద రోజుకు 12 గంటలు వెచ్చించినా మిగిలేది అరకొరేనని 62 ఏళ్ల మహిళ ఏకరువు పెట్టింది. ఈ రోజు కేవలం రూ.100 మాత్రమే తనకు మిగిలాయని వాపోయింది. పెద్దావిడకు సాయం చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించాలని భావించిన కవల్ చబ్రా రూ.3000 విలువైన పండ్లు అన్నింటినీ కొనుగోలు చేశారు. కవల్ చేసిన పనికి నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.