Lottery: ఇతనే నిజమైన అదృష్టవంతుడు.. అప్పులపాలై ఇల్లు అమ్మడానికి ముందే ₹కోటి లాటరీ..!
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కొందరికి అలా కలిసి వస్తుందంతే..! కేరళలోని కొయ్‌కోడ్‌లో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదృష్టం
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కొందరికి అలా కలిసి వస్తుందంతే..! కేరళలోని కొయ్‌కోడ్‌లో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అప్పులు తీర్చేందుకు తన కలల ఇంటిని అమ్మడానికి కొద్ది గంటల ముందే ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా కోటి రూపాయల జాక్‌పాట్ తగలడంతో అతడి జీవితమే మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ బవ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎనిమిది నెలల క్రితమే 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టుకున్నాడు. అయితే, తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు.. తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్ పంపేందుకు బ్యాంకులు, బంధువుల నుంచి దాదాపు 50 లక్షల వరకు రుణం తీసుకొని తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు ఇంటిని 40లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైన బవ.. సోమవారమే కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకున్నాడు.
తమకు ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఈ ఇల్లేనని.. దాన్ని అమ్మేశాక కుటుంబంతో కలిసి అద్దె ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తన స్నేహితులు ఎవరూ తనకు సాయం చేయకపోవడంతో జాక్‌పాట్ తగులుతుందన్న ఆశతో లాటరీ టిక్కెట్లు కొంటుండేవాడు. ఇందులో భాగంగా తాజాగా లాటరీ డ్రా తీయగా తనకు జాక్‌పాట్ తగిలిందన్న విషయం బవకు తెలియడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ మొత్తంలో పన్నులన్నీ తీసేయగా బవ చేతికి 63 లక్షల రూపాయలు అందనుంది. అయితే, ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడంతో తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి రాగా.. విక్రయించడం లేదని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

