Funny Video: భార్యకు పోటీగా నైటీ వేసుకున్న భర్త.. ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు..

|

Aug 16, 2023 | 6:21 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను మనసారా నవ్వించగలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతకాలంలో లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ధరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉండేసమయంలో సౌకర్యంగా ఉంటుందని నైటీలనే ధరిస్తున్నారు.

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను మనసారా నవ్వించగలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతకాలంలో లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ధరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉండేసమయంలో సౌకర్యంగా ఉంటుందని నైటీలనే ధరిస్తున్నారు. అయితే బయటకు వెళ్తూ తన భార్య జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుందని ఓ వ్యక్తి.. ఆమె ధరించే నైటిని వేసుకున్నాడు. అది చూసిన ఆమె తన భర్తను ‘ఏంటిదీ, నైటీ ఎందుకు వేసుకున్నావు’ అని ప్రశ్నించింది. అందుకు అతను నువ్వు జీన్స్ ఎందుకు వేసుకున్నావు అని నేను అడిగానా అని బదులిచ్చాడు. నేను జీన్స్ వేసుకోవడం, మీరు నైటీ వేసుకోవడం ఒకటేనా? దీన్ని అర్జంట్‌గా విప్పేయ్ అని ఆమె చెప్పినా వినడు, నాకు మంచిగా ఉంది, నేను వేసుకున్నా, పదా మనం బయటకు పోవాలి కదా అంటాడు. ఇలా సాగుతున్న ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు. లుంగీకి మాత్రమే నైటీ పోటీ, జీన్స్ ప్యాంట్స్‌కి లెగ్గిన్స్ మాత్రమే పోటీ. వెంటనే అవి వేసుకో పో బ్రో అంటూ ఓ నెటిజన్ సరదాగా రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే మరో నెటిజన్ మీ లాంటివారే మాకు ఆదర్శం, తగ్గొద్దు అన్నా.. మీ వెనుక మేము ఉన్నాం అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోలో మంచి సందేశం ఉంది, దీన్ని అందరూ ఫాలో అయిపోవాలి అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...