Traffic police: చ‌లాన్ క‌ట్టమ‌న్న ట్రాఫిక్ పోలీస్‌ను కారుపై 4 కి.మీలు ఈడ్చుకెళ్తూ.. వైరల్ అవుతున్న వీడియో.

|

Dec 20, 2022 | 8:59 AM

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు వేస్తుంటారు పోలీసులు. అలా కారు నడుపుతూ ఫోన్‌ మాట్లాడుతున్నాడని ఓ వ్యక్తికి చలాన్‌ వేశాడు ఓ ట్రాఫిక్‌ పోలీస్‌. అయితే చలాన్‌ కట్టకపోగా ఆ ట్రాఫిక్‌ పోలీస్‌పై దౌర్జన్యానికి దిగాడు


ఇండోర్‌లో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తిని అత‌డిని సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. దాంతో కారు ఆపితే చ‌లాన్ కట్టాల్సి వస్తుందని అత‌ను ఆ పోలీస్‌ను ఢీ కొట్టి పారిపోయేందుకు ప్రయ‌త్నించాడు. కానీ, పోలీస్ కారును అడ్డుకొని బ్యానెట్ మీదకి ఎక్కాడు. అప్పటికీ ఆ వ్యక్తి కారు ఆప‌లేదు. అతన్ని బ్యానెట్‌ మీదనుంచి కిందకు దింపడానికి కారును వేగంగా అటూ ఇటూ పోనిచ్చాడు. అలా చేస్తే పట్టుతప్పి ఆ పోలీస్‌ కింద పడిపోతాడు అనుకున్నాడు కానీ అలా జరగలేదు. దాంతో కారు బ్యానెట్ మీద ఉన్న ఆ పోలీసును 4 కిలోమీట‌ర్లు వరకూ అలాగే లాక్కెళ్లాడు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డ్యూటీలో ఉన్న ఆ ట్రాఫిక్ పోలీస్ పేరు శివ సింగ్ చౌహ‌న్. ఆ కారు డ్రైవ‌ర్‌ను గ్వాలియ‌ర్‌కు చెందిన కేవ‌శ్ ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. ‘కారు న‌డుపుతూ ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తిని ఆపి, ఫైన్ క‌ట్టమ‌ని అడిగానని, దాంతో అతను దారుణానికి పాల్పడినట్లు తెలిపారు కేశవ్‌. అంతేకాదు అనుమానంతో అత‌ని కారును చెక్ చేయ‌గా ఒక తుపాకీ, తూటాలు దొరికిన‌ట్టు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 20, 2022 08:59 AM