weighing machine: ఏంది సామీ ఇదీ.. అంతపని చేశావ్‌..! దుకాణంలో రవ్వ తూకం వేస్తున్న వ్యక్తి ఎంతకీ తూకం రాక అయోమయంలో..

Updated on: Sep 27, 2022 | 8:52 AM

పరమానందయ్య శిష్యులు గురించి తెలుసుకదా.. ఎప్పుడూ ఏదో ఒక తింగరి పని చేస్తూ గురువుగారికి ఏదో ఒక తంటా తెచ్చిపెడుతుంటారు. అలాంటి పరమానందయ్య శిష్యులు మనకు


పరమానందయ్య శిష్యులు గురించి తెలుసుకదా.. ఎప్పుడూ ఏదో ఒక తింగరి పని చేస్తూ గురువుగారికి ఏదో ఒక తంటా తెచ్చిపెడుతుంటారు. అలాంటి పరమానందయ్య శిష్యులు మనకు ఇప్పుడు కూడా ఎక్కడో అక్కడ తారసపడుతూనే ఉంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కూడా సరిగ్గా అలాగే ఉన్నాడు. ఇంతకీ అతనేం చేసాడో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న దుకాణంలో ఓవ్యక్తి వెయింగ్‌ మిషన్‌పైన రవ్వ తూకం వేస్తున్నాడు. అతను ఒక కిలో రవ్వ తూకం వేస్తున్నాడు. అయితే అది ఎంతకీ అతను వేస్తున్న వెయిట్‌కి సరిపడా రావట్లేదు. ఏం జరిగిందా అని బుర్ర గోక్కున్నాడు. అయినా అర్థం కాలేదు. మళ్లీ మళ్లీ తూకం వేస్తున్నాడు. అయినా తూకం సరిపోవట్లేదు. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూసేస్తే పోలా.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వీడు నిజంగా పరమానందయ్య శిష్యుడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 27, 2022 08:52 AM