Man on Track: దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా పరుగెత్తుకొస్తున్న వ్యక్తి.. ఎందుకంటే..

|

Mar 06, 2023 | 8:49 AM

రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై ఒక కుక్క పడుకొని ఉంది. మరోవైపు అదే పట్టాలపై రైలు వేగంగా దూసుకొస్తోంది. అది గమనించిన ఒక వ్యక్తి దాన్ని కాపాడాలని ఆ రైలుపట్టాలపై పరుగెత్తాడు.

రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై ఒక కుక్క పడుకొని ఉంది. మరోవైపు అదే పట్టాలపై రైలు వేగంగా దూసుకొస్తోంది. అది గమనించిన ఒక వ్యక్తి దాన్ని కాపాడాలని ఆ రైలుపట్టాలపై పరుగెత్తాడు. ఆ వ్యక్తి రైలు రాకను పెద్దగా పట్టించుకోలేదు. కుక్కను కాపాడటంపైనే అతడి దృష్టంతా ఉంది. అయితే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారంపై ఉన్న జనం అది చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలును ఆపాలంటూ పెద్దగా కేకలు వేస్తూ సైగలు చేశారు. అది గమనించిన డ్రైవర్‌ ఆ ట్రైన్‌ను స్లో చేశాడు. ఇంతలో ఆ వ్యక్తి కుక్కను పట్టుకుని ఫ్లాట్‌ఫామ్‌పైకి చేర్చాడు. మరో వ్యక్తి చేయి అందించగా అతడు కూడా ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నాడు. దీంతో మెల్లగా వస్తున్న ఆ రైలు అనంతరం ఆ పట్టాల మీదుగా వెళ్లిపోయింది.ఈ సంఘటన అంతా ఆ రైల్వే స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ఒక వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ముంబై చాలా బిజీ సిటీ. ఎవరూ ఖాళీగా ఉండరు. ఎవరూ ఒకరినొకరు పట్టించుకోరు. అదే సమయంలో ముంబైకర్లు..’ అంటూ దీనికి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘రైలు పట్టాలపై ఉన్న మనిషిని, కుక్కను రక్షించడంలో ముంబైవాసులు చాలా బిజీగా ఉన్నారు’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ముంబై నగర వాసులపై ఉన్న పలు విమర్శలను కొందరు ప్రస్తావించగా మరికొందరు వాటిని ఖండించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 06, 2023 08:49 AM