రాళ్లకు జీవం పోస్తూ.. బండరాళ్లతో నిండిన ఆ ప్రదేశం నందనవనంలా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
మనదేశంలో కళాకారులకు కొదవే లేదు. ఇంతకు ముందు ఎందరో ఎంతో నైపుణ్యం ఉండి కూడా సరైన వేదిక లేక మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోయేవారు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ఇలాంటి వారి కళలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన కళ ప్రదర్శించాడు.
మనదేశంలో కళాకారులకు కొదవే లేదు. ఇంతకు ముందు ఎందరో ఎంతో నైపుణ్యం ఉండి కూడా సరైన వేదిక లేక మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోయేవారు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ఇలాంటి వారి కళలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన కళ ప్రదర్శించాడు. పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుతమైన కళాకృతులుగా మలిచే తీరు వీక్షకుల మనసు దోచుకుంటోంది. ఈ వీడియలో ఒక పార్క్‌లాంటి ప్రదేశంలో పెద్ద పెద్ద బండరాళ్లు అక్కడక్కడా విసిరేసినట్టున్నాయి. ఆ రాళ్లపై జంతువుల బొమ్మలు వేస్తూ అద్భుతమైన చిత్రాలుగా మార్చేసాడు ఓ యువకుడు. నిజంగా అక్కడ ఆ జంతువులు కూర్చుని ఉన్నాయా… అవి అక్కడ మేత మేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అంత అద్భుతంగా అతడు ఆ రాళ్లకు జీవం పోశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నెటిజన్లు అతడి కళను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసి ఆనందించండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

