Fishing style: చేపలు పట్టడంలో ఇతని స్టైలే వేరు.. స్పియర్‌ గన్‌తో చేపల వేట.. శిబు స్టైలే వేరప్ప..!

|

Jan 01, 2023 | 9:42 AM

కేరళలోని కొల్లాంకు చెందిన శిబు జోసెఫ్‌ డైవింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించాడు. అంతేకాదు అతను చేపలు పట్టడం కూడా వినూత్నంగా ఉంటుంది. అందులో తనకు తానే సాటి అన్నట్టుగా


కేరళలోని కొల్లాంకు చెందిన శిబు జోసెఫ్‌ డైవింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించాడు. అంతేకాదు అతను చేపలు పట్టడం కూడా వినూత్నంగా ఉంటుంది. అందులో తనకు తానే సాటి అన్నట్టుగా విభిన్న పద్ధతిలో చేపలు పడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఇతను చేపలు పట్టడానికి వలలు, గాలాలు ఉపయోగించడు. ఇతను చేపలను వేటాడే ఆయుధం ఓ గన్‌. గన్‌తోనే అతను చేపలు పడుతుంటాడు. నీటి లోపల పేల్చడానికి వాడే స్పియర్‌ గన్‌ సాయంతో శిబు చేపలను పట్టుకుంటాడు. తలకు కెమెరా ధరించి సముద్ర జలాల్లోకి దూకుతాడు. అక్కడ కనిపించే రకరకాల చేపలను స్పియర్‌ గన్‌తో వేటాడుతూ, కెమెరాతో షూట్‌ చేస్తుంటాడు. ఆ వీడియోలను యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా అతను చేపలు పడుతున్నప్పుడు తీసిన ఫోటోలను నెట్టింట పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. అయితే శిబు నెటిజన్లకు ఓ సూచన చేస్తున్నాడు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోకుండా ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దని కోరుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 01, 2023 09:42 AM