Daughter Marriage: మధ్యప్రదేశ్‌ వింత ఘటన.. దివ్యాంగురాలైన కుమార్తెకు భగవంతునితో పెళ్లి..!

|

Nov 12, 2022 | 9:18 PM

దేవుడిపై భక్తి ఒక్కోసారి విపరీత చర్యలకు దారి తీస్తోంది. భక్తి పేరిట కూతురు సంతోషం కోసమంటూ ఓ వ్యక్తి తన కూతురిని దేవుడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో జరిగింది.


శివపాల్‌ అనే వ్యాపారవేత్త తన దివ్యాంగురాలైన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆ యువతి మాట్లాడలేదు, చెవులు కూడా వినపడవు. దీంతో ఆమెకు వివాహం కావడం కష్టంగా మారింది. కుమార్తెను సంతోష పెట్టేందుకు శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని శివపాల్‌ నిర్ణయించుకున్నారు. బంధువులకు ఫోన్‌ చేసి తన కుమార్తె పెళ్లి ఉందని ఆహ్వానించారు. తీరా వచ్చాక జరుగుతున్న తంతూ చూసి ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడితో తన కూతురు వివాహం ఘనంగా నిర్వహించారు శివపాల్. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించారు. గుడిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఓ యువతి, వధువు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 12, 2022 09:18 PM