Viral Video: విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి దుర్మరణం.. ఎయిర్‌పోర్టులో టెంక్షన్.

|

Jun 30, 2023 | 8:09 PM

విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో జూన్‌ 23న ఈ ఘటన జరిగింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు వివరాల ప్రకారం.. లాస్ యాంజిలిస్..

విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో జూన్‌ 23న ఈ ఘటన జరిగింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు వివరాల ప్రకారం.. లాస్ యాంజిలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం అరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. దాంతో ఇంజిన్, గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి లాగేసుకుంది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది. దారుణ ఘటనతో తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది.

ఘటనపై ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు చేపట్టింది. కాగా మృతుడు యూనిఫీ అనే సంస్థలో పనిచేసేవాడు. ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో యూనిఫీ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్‌పోర్టు బోర్డు తేల్చింది. ఘటన జరిగిన సమయంలో భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..