Watch: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!

|

Oct 21, 2024 | 8:01 AM

హైవేల పక్కన ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, టీ కొట్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటారు కొందరు. ఒక్కోసారి వాహనప్రమాదాలు వీరి జీవితాలనే మార్చేస్తుంటాయి. ఊహించని విధంగా వాహనాల దుకాణాలు, ఇళ్లలోకి దూసుకెళ్తాయి. ఈ ప్రమాదాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. క్షణాల్లో ఇల్లు ధ్వంసమైపోయింది.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలంలోని రైల్వే గేటు వద్ద కార్బన్ పౌడర్ తో వెళ్తున్న లారీ అటుగా వస్తున్న కారు రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కారును ఢీ కొట్టిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ ఇంటిముందు నిలిపి ఉంచిన ఆటో నుజ్జు నుజ్జు అయింది. అంతటితో ఆగలేదు ఆటోను ఢీకొంటూ లారీ నేరుగా ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేదంటే ఇంట్లో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయేవారు. జరిగిన సంఘటనపై ముదునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ హెవీ లోడుతో ఉండడం వలన స్పీడ్ కంట్రోల్ చేయలేక కారును ఢీకొట్టి.. ఆపైన ఇంట్లోకి దూసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.