Viral: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏకంగా పులితోనే వాకింగ్..! వీడియో వైరల్..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, కొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. ఇందులో వన్యమృగాలకు చెందినవి ఎక్కువగా ఉంటాయి. ఇటీవల ఓ యువకుడు పెద్దపులిని వెంటబెట్టుకొని నడిరోడ్డుపైన వాకింగ్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ఓ చిన్న బాలుడు పులిని వెంటబెట్టుకొని షికారుచేశాడు.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, కొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. ఇందులో వన్యమృగాలకు చెందినవి ఎక్కువగా ఉంటాయి. ఇటీవల ఓ యువకుడు పెద్దపులిని వెంటబెట్టుకొని నడిరోడ్డుపైన వాకింగ్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ఓ చిన్న బాలుడు పులిని వెంటబెట్టుకొని షికారుచేశాడు. దానికి సంబంధించిన వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆరేళ్ల బాలుడు పెంపుడు కుక్కను షికారుకు తీసుకెళ్లినట్టు పెద్దపులిని తీసుకొని వాకింగ్‌కి బయలుదేరాడు. దాని మెడలో తాడుకట్టి దానిని పట్టుకొని నవ్వుతూ పులితోపాటు వెళ్లాడు. ఆ పులికూడా ఎలాంటి అల్లరి చేయకుండా బాలుడితో కలిసి నడిచింది. వారిద్దరూ ఏదో ప్యాలస్‌లాంటి దానిలో షికారు చేశారు. అక్కడున్న రూమ్స్ అన్నీ పులి చక్కగా పరిశీలిస్తూ బాలుడి వెంట నడిచింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. కొందరు బాలుడి ధైర్యాన్ని ప్రశంసిస్తే..కొందరు క్రూరమృగాలను ఇలా జనాల్లోకి తీసుకురావడం అంత మంచిదికాదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.