YouTuber: యూట్యూబర్‌ను చేయిపట్టి లాక్కెళ్లిన యువకుడు..ఆపై..! లైవ్‌స్ట్రీమింగ్‌లో ఉండగా వీడియో వైరల్..
ముంబైలో ఆకతాయిలు రెచ్చిపోయారు. కెమెరా సాక్షిగా మహిళా యూట్యూబర్‌పై వేధింపులకు పాల్పడ్డారు. లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుండగా ఆ యూట్యూబర్‌ను ఓ యువకుడు చేయిపట్టి లాక్కెళ్లాడు.
ఓ కొరియన్ మహిళా యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా కొందరు యువకులు అక్కడికి వచ్చారు. ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఊహించని పరిణామానికి హతాశురాలైన ఆమె ‘నో.. నో’ అంటూ అరవడం కనిపించింది. ఆమె ఎంతగా విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఆ యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెబుతూ బైక్ వద్దకు తీసుకెళ్తుండగా.. అందుకు ఆమె నిరాకరిస్తూ తన ఇల్లు అక్కడకు దగ్గరేనని, తాను వెళ్లగలనంటూ పాపం వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను బాధిత యువతి రీ ట్వీట్ చేసింది. ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. నవంబరు 30 రాత్రి తాను లైవ్ స్టీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాను మరీ స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Actress Seetha: ఐదు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న అలనాటి నటి సీత..
Marriage request: అయ్యో.. ఒంటరిగా ఉండలేకపోతున్న.. పెళ్లి చేయమని వేడుకున్న బ్రహ్మచారి.!
Elephant attack: ఏనుగుకి కోపం వస్తే.. గిట్లుంటది! షాకింగ్ వీడియో.. పాపం అవి మాత్రం ఎం చేస్తాయ్..
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

