Python Video: ఆస్పత్రిలో భారీ కొండచిలువ.. భయంతో జనం పరుగులు.. వీడియో.

|

Sep 08, 2023 | 7:59 PM

అరణ్యాల్లో నివసించాల్సిన వన్య మృగాలు పులులు, సింహాలు, ఏనుగులు సహా కొండ చిలువలు కూడా జనావాసాల బాట పట్టాయి. ఇటీవల పుణ్యక్షేత్రాల్లో సహా అనేక ప్రాంతాల్లో పులులు, ఏనుగులు హల్ చల్ చేస్తుంటే.. మరోవైపు గిరి నాగు, తాచుపాములు వంటివి ఇళ్లల్లో చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది.

అరణ్యాల్లో నివసించాల్సిన వన్య మృగాలు పులులు, సింహాలు, ఏనుగులు సహా కొండ చిలువలు కూడా జనావాసాల బాట పట్టాయి. ఇటీవల పుణ్యక్షేత్రాల్లో సహా అనేక ప్రాంతాల్లో పులులు, ఏనుగులు హల్ చల్ చేస్తుంటే.. మరోవైపు గిరి నాగు, తాచుపాములు వంటివి ఇళ్లల్లో చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా గౌతమ్ నగర్ లో 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం అయింది. భారీ కొండ చిలువను చూసిన స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. బొడ్డురాయి ఏర్పాటు కోసం పొదలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా కొండచిలువ ఒక్కసారిగా బయటకు వచ్చింది. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో బస్తీ వాసులు వణికి పోయారు సమాచారం తెలుసుకున్న స్థానిక యువకులు ధైర్యం చేసి కొండచిలువను పట్టుకున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది సహాయంతో సమీప అటవీ ప్రాంతంలో కొండచిలువను సురక్షితంగా వదిలిపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..