చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా

|

Dec 26, 2024 | 1:56 PM

ఆదివారం మంచి చేపలు చిక్కితే.. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడ్డారు జాలర్లు. రాత్రి వలలు వెసి వెళ్లారు. ఉదయం ఎంతో ఉత్సాహంగా వెళ్లి.. వలలు తీశారు. ఓ వల బరువుగా అనిపించడంతో.. దండిగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు. కానీ బయటకు లాగి చూడగా.. వారి ఆశలు గల్లంతయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం పొద్దుపొద్దున్నే చేపల వలలో కొండ చిలువ పడటంతో అంతా షాకయ్యారు.

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జొన్నలబగడ జలాశయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డచిన కొన్ని నెలల నుంచి కోడి, మేక మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో సండే నాన్ వెజ్‌ను తక్కువ ఖర్చుతో ముగించాలనుకుంటే మాత్రం ఫిష్ వైపు మొగ్గు చూపాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో చేపలను పెద్ద మొత్తం అమ్మాలని ముందురోజు రాత్రే జలాశయంలో వలలు వేసి ఉంచారు జొన్నలబగడ జలాశయం మత్స్యకారులు. అయితే పొద్దునే వెళ్లి చూసేసరికి వల బరువెక్కింది. పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించారు. కోటి ఆశలతో వలను బయటకు లాగారు. అయితే మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యేలా ఓ పెద్ద కొండ చిలువ దర్శనం ఇచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క గంటలో శ్రీవారి దర్శనం.. ఏఐ టెక్నాలజీతో ఎంతవరకు సాధ్యం ??

దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా

క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..

బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌.. బిర్యానీ తింటుండగా..

Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర