Monkey Video: ఇంటిపైనుంచి కిందపడి మృతిచెందిన కోతి.. అతను ఏంచేశాడంటే..?

|

Oct 02, 2023 | 8:31 AM

సాధారణంగా ఏదైనా జంతువు లేదా పక్షులు మృతి చెందితే వాటి మృత కళేబరాలను చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. అదే మనిషి మరణిస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తారు..సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మనుషులైనా, పశుపక్ష్యాదులైనా ప్రాణం, జీవం ఒక్కటే నని నిరూపించాడు ఓ వృద్ధుడు. తన ఇంటి ఆవరణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ కోతికి పద్ధతిగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు.

సాధారణంగా ఏదైనా జంతువు లేదా పక్షులు మృతి చెందితే వాటి మృత కళేబరాలను చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. అదే మనిషి మరణిస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తారు..సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మనుషులైనా, పశుపక్ష్యాదులైనా ప్రాణం, జీవం ఒక్కటే నని నిరూపించాడు ఓ వృద్ధుడు. తన ఇంటి ఆవరణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ కోతికి పద్ధతిగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్ వి గ్రామంలో గోల మల్లయ్య అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కోతులు గుంపులుగా చేరుతుంటాయి. ఆహారం కోసం అటూ ఇటూ ఉరుకులాడుతుంటాయి. ఈ క్రమంలో అతని ఇంటి స్లాబ్‌ పైనుంచి ప్రమాదవశాత్తు ఓ కోతి కింద పడిపోయింది. వెంటనే ప్రాణాలు కోల్పోయింది. అది చూసి మల్లయ్య గుండె కరిగిపోయింది. వానరం అంటే హనుమంతుడి ప్రతిరూపమని, అది తన ఇంటి ఆవరణలో మ్యత్యువాతపడటం అతన్ని కలచివేసింది. చనిపోయిన ఆ కోతిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. చుట్టుపక్కలవారి సాయంతో దానికి అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే డప్పువాళ్లను పిలిపించి ఎద్దులబండిలో వానరం మృతదేహాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించాడు. అనంతరం ఆ వానరాన్ని ఖననం చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..