Helicopter: నడి రోడ్డుపై హెలికాప్టర్‌ ల్యాండ్‌.. భారీ ట్రాఫిక్‌ జామ్‌.. పలు రకాలుగా స్పందింస్తున్న నెటిజన్స్.

|

Sep 11, 2023 | 9:21 AM

దేశంలో పెరుగుతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. ఇక బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోడ్డు మీదకు వెళ్తే మళ్లీ ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. అంతలా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పరిస్థితి. అక్కడి నగర వాసులు రోజూ ట్రాఫిక్‌లో ఎదుర్కొనే ఆశ్చర్యకరమైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

దేశంలో పెరుగుతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. ఇక బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోడ్డు మీదకు వెళ్తే మళ్లీ ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. అంతలా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పరిస్థితి. అక్కడి నగర వాసులు రోజూ ట్రాఫిక్‌లో ఎదుర్కొనే ఆశ్చర్యకరమైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అందులో కొన్ని బాధను కలిగిస్తే మరికొన్నేమో వినోదభరితంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఓ హెలికాప్టర్‌ ల్యాండ్ అయింది. సరిగ్గా రోడ్డుకు మధ్యలో హెలికాప్టర్‌ దించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఆ హెలికాప్టర్‌ని చూస్తూ వాహనదారులంతా రోడ్డుపై అలాగే నిలిచిపోయారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ట్రాఫిక్‌ సమస్యకు కారణం ఇలాంటివే.. అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు కేవలం రోడ్డుమీద నడిచే వాహన డ్రైవర్లకు మాత్రమే కాదు.. పైలట్లకు కూడా చేయాలి అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఓ పక్షి రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అందుకనే ఆఫీసుకు రావటానికి ఆలస్యం అయిందని బాస్‌కు చెప్తాను అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..