మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం కొందరు పిచ్చి చేష్టలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటనలూ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అందమైన అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన వివారాలు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
బెంగళూరులో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రీతూ జూన్ అనే యువతి జనవరి 12న మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆమె పక్కన కూర్చున్న ఓ బాలిక చేతికి ఉన్న బంగారు గాజు డిజైన్ ఆమెకు బాగా నచ్చింది. దాంతో తనుకూడా అలాంటి గాజునే చేయించుకోవాలని భావించారు. దాంతో ఆ గాజు ధరించిన బాలికను ఆ గాజును ఒక ఫొటో తీసుకోవచ్చా? అని అడిగారు. అందుకు ఆ బాలిక ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికున్న గాజును తీసి రీతూ చేతిలో పెట్టింది. డిజైన్ స్పష్టంగా కనిపించడానికి ఫొటో తీసుకోవడం మీకు ఈజీగా ఉంటుందని చెప్పింది. ఆమె నమ్మకానికి రీతూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ బాలిక నవ్వుతూ అది నిజమైన బంగారం కాదని, ఆర్టిఫిషియల్ గాజు అని చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :