Viral: రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద.. దారుణంగా.!

Viral: రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద.. దారుణంగా.!

Anil kumar poka

|

Updated on: Aug 03, 2024 | 7:45 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన లఖన్‌నవూలో జరిగింది. భారీగా వరద నీరు నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జి మీదుగా భర్తతో కలిసి బైక్‌పై వెళుతున్న మహిళను కొందరు ఆకతాయిలు దారుణంగా వేధించారు. రోడ్డుపై వరద నీటిని దోసిళ్లతో ఆమెపై ఎత్తిపోస్తూ రాక్షసానందం పొందారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక నుంచి అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన లఖన్‌నవూలో జరిగింది. భారీగా వరద నీరు నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జి మీదుగా భర్తతో కలిసి బైక్‌పై వెళుతున్న మహిళను కొందరు ఆకతాయిలు దారుణంగా వేధించారు. రోడ్డుపై వరద నీటిని దోసిళ్లతో ఆమెపై ఎత్తిపోస్తూ రాక్షసానందం పొందారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక నుంచి అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టారు. నీటిలో బైక్ నడపలేక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కొందరు వాహనాన్ని వెనక్కులాగి ఆ దంపతులు కింద పడిపోయేలా చేశారు. అయితే, పోలీసులు వెంటనే కలగజేసుకుని అల్లరి మూకలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటన నెట్టింట పెనుకలకలానికి దారి తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఆమె భర్త ముందే అల్లరి మూకలు రెచ్చిపోయిన తీరు అనేక మందిని ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.