Viral Video: జురాసిక్‌ పార్క్‌లోని చిన్నసైజ్‌ డైనోసార్లను తలపించిన ఉడుములు.. వైరల్‌ గా మారిన వీడియో

|

Jul 08, 2021 | 4:32 PM

Viral Video: చిన్నవారిని పెద్దలను అలరించిన మూవీ జురాసిక్ పార్క్.. ఈ సినిమా గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఆ సినిమాలో డైనోసార్లను చూస్తే ఎలాంటి వారికైనా భయం..

Viral Video: జురాసిక్‌ పార్క్‌లోని చిన్నసైజ్‌ డైనోసార్లను తలపించిన ఉడుములు.. వైరల్‌ గా మారిన వీడియో
Jurassic Park Vibes
Follow us on

Viral Video: చిన్నవారిని పెద్దలను అలరించిన మూవీ జురాసిక్ పార్క్.. ఈ సినిమా గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఆ సినిమాలో డైనోసార్లను చూస్తే ఎలాంటి వారికైనా భయం కలగాల్సిందే. అడవుల్లో సంచరించే డైనోసార్లు మనుషులపై విరుచుకుపడుతూ.. వారిని వెంటాడి చంపేసే సీన్స్‌ చాలా భయానకంగా ఉంటాయి. ఈ సినిమా 1993లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై అప్పట్లో సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ మూవీలో పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సేమ్‌ టు సేమ్.. ఇప్పుడు ఆ సినిమాను తలపించేలా తాజాగా ఓ పార్క్‌లోని ఉడుములు గుంపులు గుంపులుగా పరిగెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఉడుములు పరిగెడుతున్న సీన్‌ చూస్తే చిన్నసైజ్‌ డైనోసార్లను చూసినట్టే అనిపిస్తోంది. ఈ వీడియోను ‘స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఓ యూజర్ పోస్ట్‌ చేశారు. దీనిని మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్‌ చేయడంతో.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోలో ఉడుముల గుంపును ఎవరో తరుముతున్నట్టుగా చాలా స్పీడ్‌గా పరిగెడుతున్నాయి. ఈ ఉడుములను ఇగువానాస్‌ అని కూడా పిలుస్తారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ దృశ్యం అచ్చం మరో జురాసిక్‌ పార్ట్‌ సినిమాను తలపిస్తోందంటూ.. పలువురు కామెంట్స్‌ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ప్రసుత్తం ఈ వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

 

Also Read: గుడ్డు మంచి పోషకారమే కాదు .. జుట్టుకు అందాన్ని, పోషకాన్ని ఇచ్చే సౌందర్యం సాధనం..