Viral: ప్రియుడి మోజులో కన్నతండ్రినే కడతేర్చాలనుకుంది.. చివరికి ట్వీస్ట్ అదుర్స్..
ఇటీవల కొందరు ఆడవాళ్లు ప్రియుడి మోజులో పడి భర్తలనే చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ భర్తని కాదు, ప్రియుడి మోజులో పడిన ఓ యువతి ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాలనుకుంది. ప్రియుడితో గడపాడానికి తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె సుపారీ ఇచ్చి మరీ తండ్రిని చంపడానికి ప్లాన్ వేసింది.
సోలాపుర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా స్థానికంగా మంచి పేరున్న వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి, చైతన్య అనే యువకుడ్ని ప్రేమించింది. వీరి ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని, ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నా తండ్రి తమను విడదీస్తాడని భావించిన ఆ యువతి మహేంద్రను లేపేయానుకుంది. అందుకు పక్కాగా ప్లాన్ వేసుకుంది. ప్లాన్ లో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి, ఆగస్టు 6 రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్ దిగి తండ్రిని రమ్మని ఫోన్ చేసింది. కూతురుని ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో వచ్చాడు మహేంద్ర. ఇంటికి తిరిగి వెళుతుండగా వాడచివాడి గ్రామ సమీపంలో టాయిలెట్ వస్తుందని కారును ఆపింది సాక్షి. ఆ వెంటనే కారు వెనుకాలే రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి అతని రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. బాధితుడు అరుపులు విన్న స్ధానికులు తీవ్ర గాయాలతో ఉన్న మహేంద్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు బాధితుడి కూతురే ప్రధాన నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...