Fox Attack: పార్క్‌లో ఫోన్‌ మాట్లాడుతున్న మహిళ.. ఒక్కసారిగా ఎటాక్‌ చేసిన నక్క.. నెట్టింట వీడియో వైరల్‌

Updated on: Sep 01, 2022 | 9:11 PM

సాధారణంగా పార్కులకు వెళ్లినప్పుడు అన్నీ మరిచిపోయి ఆనందంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు పర్యాటకులు. అయితే జూలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి.


సాధారణంగా పార్కులకు వెళ్లినప్పుడు అన్నీ మరిచిపోయి ఆనందంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు పర్యాటకులు. అయితే జూలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవలసి వస్తుంది. అసలేం జరిగిందంటే…సాధారణంగా నక్కలు మనుషులను చూస్తే పారిపోతాయి. కానీ ఇక్కడ ఓ నక్క ఓ మహిళపై దాడికి పాల్పడింది. ఎలా అంటే.. ఆ మహిళ తన ఇంటి బయట పార్క్‌లాంటి ప్రదేశంలో నిలబడి ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుంది.ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ నక్క పరుగు పరుగున వచ్చి ఆమెపై దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి భయపడిన మహిళ ఆ నక్కనుంచి తప్పించుకోడానికి చాలా ప్రయత్నించింది. అయితే నక్క మాత్రం వెనక్కు తగ్గలేదు. అలా చాలాసేపు ఆ మహిళను ఎటాక్‌ చేసిన నక్క పలు చోట్ల గాయపరిచింది. అది గమనించిన సదరు మహిళ భర్త హుటాహుటిన అక్కడకు వచ్చి, కర్ర సహాయంతో నక్కను తరిమేసాడు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. అక్కడి సీసీ కెమెరాలో నక్క దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. అపై ట్విటర్‌లో షేర్ చేయడంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 01, 2022 09:11 PM