Chennai: ఆవును తినేసిందన్న కోపంతో పులులనే చంపేసాడు.. ఎలా అంటే..?

|

Sep 13, 2023 | 11:50 PM

చెన్నై నీలగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు పులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవలాంజీ అటవీప్రాంతలో 8 సంవత్సరాల వయసున్న ఒకపులి, మూడేళ్ల వయసున్న మరో పులి మృతి చెందాయి. అదే ప్రాంతంలో చనిపోయిన ఆవుకూడా కనిపించింది. విషప్రయోగం కారణంగా పులులు మృతిచెందాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేల్చారు.

చెన్నై నీలగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు పులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవలాంజీ అటవీప్రాంతలో 8 సంవత్సరాల వయసున్న ఒకపులి, మూడేళ్ల వయసున్న మరో పులి మృతి చెందాయి. అదే ప్రాంతంలో చనిపోయిన ఆవుకూడా కనిపించింది. విషప్రయోగం కారణంగా పులులు మృతిచెందాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేల్చారు. దాంతో పులులపై విషప్రయోగం చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. తన ఆవును తినేసినందుకే పులులకు విషం పెట్టానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తన ఆవును పులులు తినేసాయని, తన జీవనాధారం కోల్పోయానని, అందుకే అదే ఆవు మాంసంలో విషం కలిపానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న అటవీశాఖ అధికారులు ఆవు యజమానిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 13, 2023 10:42 PM